‘కరోనా బీర్‌ తయారీ నిలిపివేస్తున్నాం’

3 Apr, 2020 13:50 IST|Sakshi

మెక్సికోలో 50 కరోనా మరణాలు 

మెక్సికో సిటీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా బీర్‌ తయారీని నిలిపివేస్తున్నట్లు గ్రూపో మాడెలో ప్రకటించింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ మెక్సికో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు... ‘‘ బీర్‌ ప్లాంట్లలో ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గించబోతున్నాం’’అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం గనుక సహకరిస్తే తమ సంస్థలోని 75 శాతం మంది సిబ్బంది బీర్‌ తయారీలో నిమగ్నమయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. కాగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కారణంగా అమెరికాలో కరోనా బీర్‌ అమ్మకాలు 40 శాతం మేర అమ్మకాలు పడిపోయాంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే గ్రూప్‌ మాడెలో ఈ వార్తలను ఖండించింది. (చైనాకు పేరుప్రఖ్యాతులే ముఖ్యం: నిక్కీ హేలీ)

అంతేగాకుండా కరోనా వ్యాప్తిలోనూ జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాలతో  గ్రూప్‌ మాడెలోతో పాటు మెక్సికోలోని బీర్‌ మరో ప్రధాన ఉత్పత్తిదారు హెంకెన్‌ సైతం నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బీరు ప్రియులు నిరాశకు గురవుతున్నారు. కాగా కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ 30 వరకు అత్యవసరాలు మినహా అన్ని ఉత్పత్తుల సరఫరాను నిలిపివేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది. ఆ దేశంలో ఇప్పటివరకు 1500 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా... 50 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో కేవలం వ్యవసాయవ, దాని అనుబంధ ఉత్పత్తిదారులకు మాత్రమే అనుమతినిచ్చింది.(ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు)

మరిన్ని వార్తలు