సంచలన ఆదేశాలు : గీత దాటితే.. కాల్చి చంపండి

2 Apr, 2020 12:51 IST|Sakshi

మనీలా : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతరు చేస్తున్న వారిపై ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, వైద్య కార్మికులను దూషించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఇక ప్రభుత్వ ఆదేశాలను పెడచెవినపెట్టి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నవారి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని సహించేది లేదని, వారిని కాల్చి చంపండి అంటూ రోడ్రిగో పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించారు. దేశంలో లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి 4బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆహారకొరతతో ఒక్కరు కూడా మరణించకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. 

ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని కోరారు. ప్రతీరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేయాలని రోడ్రిగో డ్యూటెర్టే కోరారు. అయితే మానవ హక్కుల కార్యకర్తలతోపాటూ, నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా అధ్యక్షుడి నిర్ణయాన్ని తీవ్రంగాఖండించారు. దీంతో కరోనా తీవ్రత దృష్ట్యా దేశాధ్యక్షుడు డ్యూటెర్టే ఇలా మాట్లాడారని, ప్రస్తుత పరిస్థితిని పోలీసులు అర్థం చేసుకోగలరని, పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఎవరినీ కాల్చవద్దని ఫిలిఫ్పీన్స్ పోలీసు చీఫ్ కోరారు.

మరిన్ని వార్తలు