విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలు..

7 Feb, 2020 18:14 IST|Sakshi

విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలంటే ఇదేనేమో! దక్షిణ కొరియాలో 24 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించిన నేపథ్యంలో ఓ చర్చి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం వేలాది జంటలు ఒకటయ్యాయి. అన్ని జంటలు వైరస్‌ సోకకుండా ముఖానికి మాస్క్‌లు ధరించడమే కాకుండా, ఆ సామూహిక వివాహ మహోత్సవానికి హాజరైన 30 వేల మంది బంధు మిత్రుల్లో ఎక్కువ మంది ముందు జాగ్రత్తగా ముఖానికి మాస్క్‌లు వేసుకున్నారు. (కరోనా వైరస్కువితిన్ డేస్)

గేపియాంగ్‌ నగరంలోని ‘చియాంగ్‌శిమ్‌ వరల్డ్‌ పీస్‌ సెంటర్‌’లో ‘యూనిఫికేషన్‌ చర్చ్‌’ ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహ మహోత్సవం కన్నుల పండగలా జరిగింది. యువతీ యువకులు పెళ్లి ప్రమాణాలు చేయగా, యువకులు, యువతుల చేతులు పట్టుకొని ఉంగరాలు తొడిగి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఎప్పటి నుంచో యువతీ యువకులకు సన్‌ మ్యూంగ్‌ మూన్‌ నిర్మించిన ఈ చర్చియే సంబంధాలను ఖరారు చేస్తూ వచ్చింది. ‘ఈరోజు నాకు పెళ్లయినందుకు అమితానందంగా ఉంది’  అని రెండు నెలల క్రితమే పెళ్లి ఖరారైన ‘చోయి జి–యంగ్‌’ అని వ్యాఖ్యానించారు. (కరోనా భయం; వీడియో కాల్లో ఆశీర్వాదాలు)

పొరుగునే ఉన్న చైనాలో కరోనా వైరస్‌ దాదాపు 30 వేల మంది సోకగా, దక్షిణ కొరియాలో మాత్రం 24 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి రాకపోకలను కొరియా పూర్తిగా నిషేధించింది. ముందు జాగ్రత్తగా సామూహికంగా జరుపుకునే  పండుగలను, పబ్బాలను, పట్టభద్రుల ప్రమాణోత్సవాలను బహిష్కరించింది. సామూహిక మత కార్యక్రమాలపై కూడా ఆంక్షలు విధించింది. అయితే చర్చి ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవాలకు అనుమతించేందుకు ఓ బలమైన కారణం ఉంది. (కరోనా వైరస్ మృతుల సంఖ్య వేలల్లోనా!)

సన్‌ మ్యూంగ్‌ మూన్‌ వందో జయంతిని పురస్కరించుకొని శుక్రవారం యూనిఫికేషన్‌ చర్చి పలు దేశాలకు చెందిన జంటలకు ఉచితంగా వివాహం చేసేందుకు గత నాలుగేళ్లుగా సన్నాహాలు చేస్తూ వచ్చింది. ఫలితంగా ప్రపంచంలోని 64 దేశాలకు చెందిన ఆరువేల జంటలు ఈ రోజున ఒక్కటయ్యాయి. (కరోనా విశ్వరూపం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా