కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్

14 Apr, 2020 10:13 IST|Sakshi

బీజింగ్ : కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించే చర్యల్లో చైనా మరో అడుగు ముందుకేసింది.  చైనా శాస్త్రవేత్తలు  కరోనా వైరస్ టీకా  రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ను మొదలు పెట్టింది. ఇందుకు దాదాపు 500 మంది వాలంటీర్లను నియమించుకుంది. ముఖ్యంగా వుహాన్ కు చెందిన 84 ఏళ్ల వుహాన్ నివాసి కూడా ఉన్నారు.  మార్చిలో  చేపట్టిన మొదటి దశ పరీక్షల్లో పరిశోధకులు టీకా భద్రతపై దృష్టి సారించగా, రెండవ దశలో దృష్టి టీకా సమర్థతపై దృష్టి పెట్టారు. అలాగే రెండవ దశలో మొదటి దశ కంటే ఎక్కువమంది వాలంటీర్లు ఉన్నారనీ, ఇందులో ప్లేసిబో నియంత్రణ  బృందం కూడా ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. ముఖ్యంగా, క్లినికల్ హ్యూమన్ టెస్టింగ్‌లో మొదటి దశగా వారు తెలిపారు. రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్లకుగాను మానవ పరీక్షలను చైనా ఆమోదించినట్లు చైనా మీడియా జిన్హువా మంగళవారం నివేదించింది.  (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ ఆఫ్ చైనా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్దతుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ది చేసింది. ఈ పరిశోధనా  బృందానికి పిఎల్‌ఎ మేజర్ జనరల్ చెన్ వీ నేతృత్వం వహిస్తున్నారు.దీనికి  సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసెస్ సోమవారం (ఏప్రిల్ 13) మాట్లాడుతూ, కరోనావైరస్ కోవిడ్ -19 స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమని, ఒక టీకా మాత్రమే కరోనావైరస్ పూర్తిగా  అడ్డుకోగలదని  స్పష్టం చేశారు. ఇది 2009 ఫ్లూ మహమ్మారి కంటే 10 రెట్లు ప్రాణాంతకమని  ఆయన  చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది, దేశంలొ 339 మంది మృత్యువాత పడ్డారు.   ( కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్  )

చదవండి : కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం
పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు

మరిన్ని వార్తలు