కరోనాతో మశూచి టీకా కార్యక్రమాలకు దెబ్బ

15 Apr, 2020 07:14 IST|Sakshi

ప్యారిస్‌: కరోనా కారణంగా ఇప్పుడు పిల్లలకు మశూచి టీకా ఇచ్చే కార్యక్రమానికీ విఘాతం కలుగుతోందని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువైందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. చాలా దేశాల్లో ఇప్పటికే మశూచి వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్నవాటితో కలిపి మొత్తం 24 దేశాల్లో కోవిడ్‌ కారణంగా టీకా కార్యక్రమాలను నిలిపివేశారని మరో 13 దేశాల్లో వాయిదా వేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ చెబుతున్నాయి. కరోనా తరుణంలో రోగ నిరోధక శక్తిని అందించే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని మీసల్స్‌ అండ్‌ రూబెల్లా ఇనిషియేటివ్‌ స్పష్టం చేసింది. టీకా కార్యక్రమాలను నిలిపివేయడం, వాయిదా వేయడం ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మంది పిల్లలపై ప్రభావం పడనుందని హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు