క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఆ డ్ర‌గ్ ఫెయిల్‌..

24 Apr, 2020 09:32 IST|Sakshi

న్యూయార్క్‌:  క‌రోనా చికిత్స‌లో భాగంగా నిర్వ‌హించిన మొద‌టిద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో రెమ్‌డెసివ‌ర్ డ్ర‌గ్ ఫెయిల‌య్యింది. ఈ మందు వాడ‌టం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు ఉన్న‌ట్లు నిపుణులు నిర్ధారించారు. గిలెడ్ సైన్సెన్స్ త‌యారు చేసిన ఈ డ్ర‌గ్ క‌రోనాపై ప‌ని చేయ‌లేద‌ని తేలింది. దీనికి సంబంధించిన నివేదిక‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అందించారు. రెమ్‌డెసివ‌ర్ ఔష‌దాన్ని 237 మంది క‌రోనా రోగుల‌పై ప్ర‌యోగిస్తే 158 మందిపై అది సైడ్ ఎఫెక్ట్స్ చూప‌డంతో మొద‌టిద‌శ‌లోనే డ్ర‌గ్ వాడ‌కాన్ని నిషేదించిన‌ట్లు చైనా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అంతేకాకుండా వారిలో మ‌ర‌ణాల రేటు కూడా న‌మోదైన‌ట్లు పేర్కొన్నారు. అయితే గిలెడ్ సైన్సెన్స్‌ కంపెనీ ప్ర‌తినిధి మాట్లాడుతూ.. రెమ్‌డెసివ‌ర్ డ్ర‌గ్‌పై ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతాయ‌ని, ఇది క‌రోనాను అంతం చేస్తుంద‌ని న‌మ్ముత‌న్న‌ట్లు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ సాధ్య‌మైనంత ఎక్కువ‌గా జ‌రిగిన‌ప్ప‌డే ఔష‌ధం ప‌నితారు తెలుస్తుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్  అండ్ ట్రాపికల్ మెడిసిన్లో ఫార్మాకోపీడెమియాలజీ ప్రొఫెసర్ స్టీఫెన్ ఎవాన్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాకుండా కరోనా సోకిన వెంట‌నే డ్ర‌గ్‌ని ప్ర‌యోగించాల‌ని అప్పుడే అది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌గ‌ల‌ద‌ని పేర్కొన్నారు. మ‌నిషి శ‌రీరంలో ఉండే డీఎన్ఏ, ఆర్ ఎన్ఏ ఒక్కొక్క‌రిలో ఒక్కో విధంగా ఉండ‌టం వ‌ల్ల డ్ర‌గ్ ప‌నితీరు వేరుగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ప్ర‌స్తుతం క‌రోనాపై సంజీవ‌నిలా ప‌నిచేస్తున్న  హైడ్రాక్సీక్లోరోక్విన్  మందు కూడా అన్ని దేశాల్లో ఒకే విధంగా ప‌నిచేయ‌డం లేద‌ని..మ‌నిషి రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ట్టి ఇది ప్ర‌భావం చూపుతుంద‌ని అన్నారు.

మరిన్ని వార్తలు