కరోనా : అమెరికాలో ఒక్క రోజులోనే 884 మంది మృతి

2 Apr, 2020 08:57 IST|Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు విడిచారు. కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ.. కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక బుధవారం ఒక్కరోజే 884 మంది మృతిచెందడం అగ్రరాజ్యంలో ఆందోళన కలిగిస్తోంది.కరోనాతో ఒక్కరోజులో అత్యధిక మంది మృతి చెందడం ఇదే కావడం గమనార్హం. అక్కడ కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది. నిన్న ఒక్కరోజే 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రానికి 5,110 మంది అమెరికన్లు కరోనా బారినపడి మృతి చెందారు.
(చదవండి : కొనసాగుతున్న విధ్వంసం)

గడచిన 24 గంటల్లో 25,200 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 2,15,175 కేసులు నమోదయ్యాయి. కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో కరోనా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, దాదాపు 2,40,000 మంది మృత్యువాత పడే అవకాశం ఉందని శ్వేతసౌద వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా 9,35,840 మందికి కరోనా వైరస్‌ సోకగా, 47,241 మంది మృతి చెందారు. 

మరిన్ని వార్తలు