ఆంగ్ సాన్ సూకీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందా?

30 Oct, 2015 00:01 IST|Sakshi
ఆంగ్ సాన్ సూకీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందా?

నవంబర్ లో జరగునున్న మయన్మార్ స్వేచ్ఛాయుత ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ ప్రెసిడెంట్ ఆయ్యే అవకాశం లేదా?  ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్‌డీ) పార్టీ  సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయాన్ని సాధించినా అధ్యక్షపదవిని దక్కించుకునే అవకాశాలు తక్కువే అని రాజకీయ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 59 ఎఫ్ ప్రకారం.. సూకీ ఓ విదేశీ వ్యక్తిని పెళ్ళాడి, చట్టబద్ధంగా పిల్లలు ఉండటంతో ఆమెను అనర్హురాలుగా ప్రకటించవచ్చు. అంతేకాక ఆమె ఇద్దరు కుమారులైన.. కిమ్, అలెగ్జాండర్లు  బ్రిటిష్ పాస్ పోర్టు కలిగి ఉండటం కూడ ఆమె పదవిని దక్కించుకునేందుకు అవకాశాలు లేవు.

సూకీ.. ఎన్నికల్లో భారీ విజయాన్ని వరించినా... ఆర్టికల్ లోని నిబంధనల ఆధారంగా ఆమె అధ్యక్షపదవికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి ఆర్మీ ప్రతినిధులు ఏదైనా ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకుంటే తప్పించి సూకీ.. ప్రెసిడెంట్ అయ్యే మార్గమే లేనట్టు ప్రస్తుత పరిస్థితులు చెప్తున్నాయి. ఒకవేళ సూకీ ప్రెసిడెంట్ కాకపోతే? మరి ఎవరు అవుతారన్నది మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఒకవేళ ఎన్ ఎల్డీ మద్దతును కనుక పొందగల్గితే స్పీకర్ హట్టా యు షూ మన్ అధ్యక్షుడుగా మారవచ్చు. అయితే ఇది ఆంగ్ సాన్ సూకీకి, సైనికులకు మధ్య అంతరాన్నితగ్గించి.. వారితో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగితే మాత్రమే జరిగుతుంది. అంతేకాదు రాజ్యాంగ మార్పుకోసం కూడ వారివద్ద హామీ తీసుకోవాల్సి కూడ ఉంటుంది. అయితే ఆగస్టు నెలలో జరిపిన తిరుగుబాటు లో అతన్ని యూఎస్పీడీ అధిపతి పదవినుంచీ తొలగించడంతో సూకీ సైన్యం మద్దతును ఇప్పటికే కోల్పోయింది. సైనిక మద్దతు లేకుండా సూకీ పదవిని పొందే అవకాశం ఎట్టిపరిస్థితిలోనూ లేనట్లే కనిపిస్తుంది. మరి అప్పుడు ఎవరు అధ్యక్ష పదవిని పొందుతారు? అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగానే ఉంది.

ఈనెల మొదట్లో ఓ భారతీయ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఎన్ ఎల్డీ భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంలో సూకీ...  తానొక పౌరురాలు కావడంతోనే ఈ అవకాశం వచ్చినట్లు భావిస్తున్నానని చెప్పింది. అదే ఆత్మ విశ్వాసంతో ఆమె నేటికీ సమర్థవంతంగా అధ్యక్ష పదవిని చేజిక్కించుకోగలననే ధీమాతో...ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మాజీ కమాండర్ ఇన్ ఛీఫ్.. టిన్ ఊ, మాజీ సైనిక అధికారి విన్ హెటిన్ వంటి వారిని సన్నిహిత అంతరంగికులుగా ఉంచుకోవడం, అతి దగ్గరకు తీయడం కూడ ఆమెకు అవకాశాలను జారవిడుచుకున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే షూ మన్ కూ...సూకీకి ఇప్పటికే డీల్ కుదిరిపోయిందని కొన్ని పుకార్లు కూడ షికార్లు చేస్తున్నాయి. అదే జరిగితే.. రెండేళ్ళ తర్వాత అతడు రాజ్యాంగ మార్పులను చేసి ఆమెకు అవవాశం కల్పించేట్లు ఒప్పందం కుదిరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా  నవంబర్ 8 న ఓటర్లు చెప్పే జాతకాలను బట్టే సూకీ అధ్యక్ష పదవిపై చిక్కు ముడి వీడుతుంది.

మరిన్ని వార్తలు