పెళ్లయిన 3 నిమిషాలకే డైవోర్స్‌! 

10 Feb, 2019 02:52 IST|Sakshi

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ కువైట్‌లో ఓ జంట మాత్రం మూడు నిమిషాలకే ఈ పెళ్లి మాకొద్దు బాబోయ్‌ అంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. కువైట్‌లో గత నెలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కువైట్‌లో ఓ జంట తమ పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌పై జడ్జి ఎదుట సంతకాలు పెట్టారు. అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో పెళ్లికూతురు పొరపాటున కింద పడింది. పక్కనే ఉన్న వరుడు ఆ అమ్మాయికి సహాయం చేయాల్సింది పోయి.. కింద పడినందుకు పరుష పదజాలంతో దూషించాడు. అంతే ఒక్కసారిగా ఉక్రోషానికి గురైన వధువు జడ్జి దగ్గరకు వెళ్లి విడాకులు కావాలని అడగటం.. ఆయన ఇవ్వడం చకచకా జరిగిపోయింది.

కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కువైట్‌ చరిత్రలోనే ఇంత తక్కువ వ్యవధిలో విడాకులు తీసుకున్న జంటగా వీరు గుర్తింపు పొందారని స్థానిక మీడియా పేర్కొంది. ఇంతకుముందు దుబాయ్‌లో ఓ జంట 15 నిమిషాల వ్యవధిలో విడాకులు తీసుకున్నా.. వీరు కేవలం 3 నిమిషాల్లోనే విడిపోయారని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా విడాకులు తీసుకున్న జంట కూడా ఇదే కావచ్చని అభిప్రాయపడింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వామ్మో.. ఇది చాలా డేంజర్‌ పక్షి!

చందమామ ముందే పుట్టాడు

పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం  

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి

200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...

ఇమ్మిగ్రేషన్‌ అలర్ట్‌: ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!

ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!

గార్లిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు, ముగ్గురు మృతి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం

వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!

దావూద్‌ ‘షేర్‌’ దందా

బ్రెగ్జిట్‌ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్‌

భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!

నీటిలో తేలియాడుతున్న ‘యూఎఫ్‌ఓ’

పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!

భారత్‌ నుంచి పాక్‌కు భారీగా దిగుమతి

అమెరికా ఎన్నికల ప్రచారంలో యోగా

గూగుల్‌కు ఊహించని షాక్‌

9మందిని విడుదల చేసిన ఇరాన్‌

అమెరికాలో మళ్లీ మరణశిక్షలు

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

కిమ్‌.. మరో సంచలనం

బ్రిటన్‌ హోం మంత్రిగా ప్రీతీ పటేల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి