మైనర్‌తో సంబంధం.. యువతికి క్షమాభిక్ష!

3 Jul, 2020 14:15 IST|Sakshi

మైనారిటీ తీరని 14 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకున్న 22 ఏళ్ల యువతిని ‘న్యూకాజిల్‌ క్రౌన్‌ కోర్టు’ ఎలాంటి కఠిన కారాగార శిక్ష విధించకుండా వదిలేయడం చర్చనీయాంశం అయింది. లండన్‌ చట్టాల ప్రకారం 16 ఏళ్లలోపు బాల బాలికలతో అంతకన్నా పెద్ద వయస్కులైన ఆడ లేదా మగ లైంగిక సంబంధం పెట్టుకున్నట్లయితే పదేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. 

ఇంగ్లండ్‌లోని న్యూకాజిల్‌లో నివసిస్తోన్న సోఫీ జాన్సన్‌ ఆన్‌లైన్‌లో 14 ఏళ్ల పాఠశాల విద్యార్థితో స్నేహం చేసింది. ఆ స్నేహం లైంగిక సంబంధానికి దారి తీయడంతో ఆమెపై కేసు నమోదయింది. న్యూకాజిల్‌ క్రౌన్‌ కోర్టు కేసులో ఈ కేసు విచారణ జరిగింది. డిఫెన్స్‌ న్యాయవాది పెన్నీ హాల్‌తోపాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డామిన్‌ డాయిగ్‌ కూడా యువతికి సానుకూలంగా వాదించడం కేసులో ఓ విశేషం. 

‘కొన్ని రోజుల్లో కేవలం ఐదు సార్లు మాత్రమే బాలుడితో నేను లైంగిక సంబంధాన్ని కొనసాగించాను. ఆ బాలుడికి 16 ఏళ్లు ఉంటాయని భావించి అతడితో అలా ఉన్నాను. ఆ తర్వాత ఆ బాలుడికి నిజంగా 14 ఏళ్లు ఉన్నాయని తెలిసి దూరమయ్యాను’ అని సోఫీ జాన్సన్‌ కోర్టుకు తెలిపారు. సోఫీ కూడా వయస్సుకు తగినట్లు ఎదగలేదని, అప్పుడప్పుడే లైంగిక కోరికలపై 16 ఏళ్ల వయస్సులో ఉన్నట్లే ఉన్నారని, పైగా లైంగిక సంబంధం కోసం బాలుడిపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకరాలేదని న్యాయవాది పెన్నీ హాల్‌ వాదించారు.

‘అవును, ఈ కేసులో బాలుడి వాంగ్మూలం కూడా సోఫీకి వ్యతిరేకంగా లేదు. బాలుడికి ఇప్పుడు 16 ఏళ్లు (రెండేళ్ల క్రితం కేసు). మైనారిటీ తీరిపోయాక సోఫీని ఓ సారి కలుసుకోవాలని ఆ బాలుడు కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఈ రెండేళ్లలో ఆమె ఎంతో శిక్షను అనుభవించారు. ఇంట్లో నుంచి గెంటేశారు. ఉన్న ప్రాంతం నుంచి వెళ్లి పోవాల్సి వచ్చింది. ఉద్యోగం కూడా పోయింది. కనుక ఆమెను క్షమించవచ్చు’ ప్రాసిక్యూటర్‌ గామిన్‌ డాయిగ్‌ వాదించారు. 

ఇరువురు వాదనలను ఆలకించిన కోర్టు మంగళవారం శిక్షను తగ్గిస్తూ తీర్పు చెప్పింది. ఎలాంటి బలవంతం లేకుండా ఇరువురు మనస్ఫూర్తిగా లైంగికంగా కలసినందున ఎలాంటి జైలు శిక్ష విధించడం లేదని, అయితే మైనర్‌తో సంబంధం పెట్టుకున్నందుకు మూడేళ్లపాటు సామాజిక సేవ చేయాలని, ఐదేళ్లపాటు ‘సెక్స్‌ నేరస్థుల రిజిస్టర్‌’లో సంతకం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు