మార్కెట్లను పునరుద్ధరిస్తాం

18 Apr, 2020 03:16 IST|Sakshi
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్‌–99 ఫేస్‌ మాస్కుల తయారీ యంత్రం. ఈ తరహా యత్నం భారత్‌లో ఇదే మొదటిది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌: కోవిడ్‌ ధాటికి విలవిలలాడుతున్న అగ్రరాజ్యంలో తిరిగి మార్కెట్లు ప్రారంభించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మూడు దశల ప్రణాళికను ప్రకటించారు. దేశంలో నిరుద్యోగ భృతి కోసం మరో 52 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కార్మిక శాఖ చెబుతున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్‌ ఉధృతికి మార్చిలో దేశవ్యాప్తంగా 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ 5.9 శాతం కుంచించుకుపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో అతి పెద్దదైన తమ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడానికి ట్రంప్‌ ప్రభుత్వం మార్కెట్లను తెరవాలని అనుకుంటోంది. ఇన్నాళ్లూ మార్కెట్ల పునరుద్ధరణపై అధ్యక్షుడిదే తుది నిర్ణయం అని వాదించిన ట్రంప్‌ ఇప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లే దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ మాటమార్చారు. రాష్ట్ర గవర్నర్లకు ఫెడరల్‌ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఇందుకోసం మూడు దశల ప్రణాళికను ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు