కరోనా అలర్ట్‌ : అమెరికాలో యోగాకు పెద్దపీట!

16 Mar, 2020 10:59 IST|Sakshi

హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌ సూచనలు

వాషింగ్టన్‌: చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా అమెరికాలోనూ విజృంభిస్తోంది. అక్కడ ఇప్పటికే 3,485 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 65 మృతి చెందారు. ఇక ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యోగా చేయాలని ప్రఖ్యాత హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌ సూచిస్తోంది. కరోనా వల్ల తలెత్తే భయం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులను యోగా, ధ్యానం దూరం చేస్తాయని తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటితో వ్యక్తి పూర్తిగా రిలాక్స్‌ కావొచ్చునని ‘కోపింగ్‌ విత్‌ కరోనా వైరస్‌ యాంగ్జయిటీ’ కథనంలో వెల్లడించింది. 
(చదవండి: కంగారెత్తిస్తున్న కరోనా)

ఇలా చేస్తే మంచి ఫలితాలు..
‘రెగ్యులర్‌గా యోగా చేసేవారిలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మెడిటేషన్‌ ఎలా చేయాలో హెడ్‌స్పేస్‌, కామ్‌, యోగా స్టూడియో, పోకెట్‌ యోగా వంటి ఎన్నో యాప్‌లు సులభంగా నేర్పిస్తున్నాయి’అని హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ఫ్యాకల్టీ, సైకియాట్రిస్ట్‌ జాన్‌ షార్ప్‌, కాలిఫోర్నియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌కు చెందిన డేవిడ్‌ జెఫెన్‌ పేర్కొన్నారు. ‘ఇప్పటికే మీరు యోగా చేస్తున్నవారైతే.. అలాగే కొనసాగించడం మంచిది. కానీ, కొత్తగా యోగా చేస్తాను అనుకుంటే.. పెద్దగా ఫలితాలు ఉండకపోవచ్చు​. కానీ, ఆరోగ్యం విషయంలో పరధ్యానంగా ఉన్నప్పుడు నూతనంగా చేపట్టే పనులు ఎంతోకొంత మేలు చేస్తాయి’అని వారు తెలిపారు.
(చదవండి: ఉగ్రవాదులూ..యూరప్‌ వెళ్లొద్దు: ఐసిస్‌)

శ్వాస సంబంధమైన వ్యాయామాలు చేయడం, హైజీన్‌గా ఉండటం, ఆఫీసుల్లో మునుపటిలా కాకుండా పనులు తగ్గించుకోవడం, ఇతరులకు దూరం పాటించడం, ఆరోగ్యరంగ నిపుణుల సలహాలు పాటించి, ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుని మసలుకుంటే కరోనాకు దూరంగా ఉండొచ్చునని చెప్తున్నారు. ఇక కోవిడ్‌-19 భయాలను తగ్గించేందుకు, ప్రజల్లో మానసిక ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని​ పెంచేందుకు హోమం కాల్చడం, దైవ ప్రార్థనలు చేస్తామని ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ వెల్లడించింది. హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌ సూచనల్ని ఉటంకిస్తూ.. ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం వైరస్‌ బారినపడి ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆందోళనను తగ్గిస్తాయని ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వాహకుడు అనిల్‌ శర్మ చెప్పారు. 
(ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తొలి బాధితుడు)

మరిన్ని వార్తలు