కరోనా ఎఫెక్ట్‌ : వీసాలను నిలిపివేసిన యూఏఈ

14 Mar, 2020 19:27 IST|Sakshi

యూఏఈ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కోవిడ్‌)ను అధిగమించేందుకు ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) కీలక నిర్ణయం తీసుకుంది. దౌత్య పాస్‌పోర్ట్‌లు మినహా అన్ని రకాల వీసాల మంజూరును మార్చి17 వరకు తాత్కాళికంగా నిలిపివేయనున్నట్లు యుఏఈ శనివారం ప్రకటించింది. కరోనా వైరస్‌ నివారణ చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు