వైట్‌ షార్క్‌ల కోసం.. డైవర్ల సాహసం..!!

18 Mar, 2018 19:33 IST|Sakshi

మెక్సికో సిటీ : పసిఫిక్‌ మహా సముద్రంలో డైవర్స్‌ సాహసం చేశారు. వైట్‌ షార్క్‌పై పరిశోధన కోసం బోనులో సముద్రం అడుగుకు వెళ్లారు. వారిని చూసిన షార్క్‌ ఒక్కసారిగా బోను వైపు దూసుకొచ్చింది. పలుమార్లు బోను చుట్టూ వేట కోసం తిరిగింది.

ఇలా ఒక్క షార్క్‌ మాత్రమే కాదు.. మూడు రకాల వైట్‌ షార్క్స్‌పై డైవర్స్‌ పరిశోధనలు చేశారు. మెక్సికో సిటీకి కొద్దిదూరంలో గల గ్వాడాలుపే ద్వీపంలో కనిపించిన రెండు టన్నులు బరువున్న వైట్‌ షార్క్‌ మాత్రం భిన్నంగా ప్రవర్తించిందని పరిశోధకుల్లో ఒకరైన జాన్‌ చెప్పారు.

బాగా లోతైన ప్రదేశాలకు వెళ్లి బోటు నుంచి కేజ్‌లను 40 అడుగుల లోతుకు దించినట్లు తెలిపారు. ఇలా మూడు రోజుల పాటు వైట్‌ షార్క్స్‌ కోసం అన్వేషణ కొనసాగినట్లు వివరించారు. 20 అడుగులు పొడవున్న ఓ ఆడ షార్క్‌ తనవైపునకు దూసుకొచ్చినట్లు చెప్పారు.

ఈ సీజన్‌లో డైవర్స్‌ చేసిన పరిశోధనల్లో ఇదే అతిపెద్ద షార్క్‌ అని మాత్రం చెప్పగలనని అన్నారు. గ్రేట్‌ వైట్‌ షార్క్స్‌కు ప్రత్యర్థులపై మెరుపుదాడి చేసే శక్తి ఉంటుంది. కన్నుమూసి తెరచేలోగా లక్ష్యాన్ని అవి చేధిస్తాయి. సీల్స్‌ చేపలు అధికంగా ఉండే గ్వాడాలుపే ద్వీపంలో వైట్‌ షార్క్స్‌ అత్యధికంగా నివసిస్తున్నాయి.

మరిన్ని వార్తలు