రొనాల్డో తనపై అత్యాచారం చేశాడు: మాజీ మోడల్‌

2 Oct, 2018 10:38 IST|Sakshi

లాస్‌ఏంజిల్స్‌: ‘నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం, అవి ఫేక్‌.. ఫేక్‌ న్యూస్‌’అంటూ పోర్చుగల్‌ కెప్టెన్‌, స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అనంతరం కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. రొనాల్డో తనను అత్యాచారం చేశాడని అమెరికన్‌ మాజీ మోడల్‌ కేథరిన్ మయోగ్రా గత నెలలో నెవడా కోర్టులో కేసు వేసింది. జూన్‌ 13, 2009 రోజున లాస్‌ వెగాస్‌లోని రొనాల్డో తన పెంట్‌హౌస్‌లో తనను హత్యాచారం చేశాడని ఆరోపించింది.  అంతక ముందు ఒక రోజు కలిశామని, తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడని, ఒంటరిగా వున్న తనపై లైంగికంగా దాడి చేసి, చిత్రవధలకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం భయపడిన రొనాల్డో తన లాయర్‌తో అగ్రిమెంట్‌ చేయించి కేసు బయటకి రాకుండా చేశాడని తెలిపింది. 

రొనాల్డొ చర్యతో భయమేసిందని, భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందనే ఉద్దేశంతో అప్పుట్లో బయటకి చెప్పలేకపోయానని వివరించింది. తాజాగా ‘మీ టూ’ ప్రోగ్రాంలో భాగంగా తనపై జరిగిన లైంగిక దాడి గురించి వివరించి, కోర్టును ఆశ్రయించింది. లాస్‌ వెగాస్‌ పోలీసులు కూడా ఆ కేస్‌ను రీ ఓపెన్‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఏ రొనాల్డో అంటూ ఎక్కడ చెప్పకపోవడంతో అందరూ క్రిస్టియానో రొనాల్డో అని అనుకుంటున్నారు. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన జర్మన్‌ మ్యాగజైన్‌ క్రిస్టియానో రొనాల్డో ఫోటో కవర్‌ పేజీపై వేసి ఆ వార్త ప్రచురించింది. దీనిపై రొనాల్డో వ్యక్తిగత లాయర్‌ ఆ మ్యాగజైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్య్కులేషన్‌ను పెంచుకునే భాగంగా ఇలాంటి నిరాధారిత వార్తలు రాయడం తగదన్నారు. మ్యాగజైన్‌పై పరువునష్టం కేసు వేస్తామని తెలిపారు. ఈ వార్తపై పోలీసులు, కేథరిన్‌ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు