ఒక్కసారి వచ్చి ఏడ్చిపోరా..?

8 Jul, 2018 01:26 IST|Sakshi

ఎవరైనా చనిపోతే.. శత్రువుకైనా కన్నీళ్లు వస్తాయి అంటారు.. ఎక్కడైనా ఇది కామన్‌. అయితే ఆఫ్రికాలోని ఘనాలో ఏడవడం తప్పనిసరి సంప్రదాయం అట. ఎందరు ఏడుస్తున్నారన్న దాన్ని బట్టి చనిపోయిన వ్యక్తిని ఎందరు ప్రేమిస్తున్నారనేది అంచనా వేస్తారట. పైగా ఎంతమంది ఏడిస్తే అంత ప్రెస్టేజీగా భావిస్తారు అక్కడి వారు. కొందరు తమ బంధువులు చనిపోతే ఏడుపు రావట్లేదట. అందుకే డబ్బులు ఇచ్చి మరీ ఏడ్పించుకుంటున్నారట. అందుకు కొందరు మహిళలను నియమించుకుంటున్నారట.

ఇప్పుడు అక్కడ అదో బిజినెస్‌గా మారిపోయింది. అలా ఏడ్చేందుకు మహిళలు కావాలంటే అమీ డోక్లీ దగ్గరికి వెళ్లాల్సిందే. ఆమె వారందరికీ బాస్‌ అన్న మాట. తెలియని వారి దగ్గరికి వెళ్లి ఏడవడం అంటే అంత సులువేం కాదని, అందుకే డబ్బులు తీసుకుని మరీ ఏడుస్తున్నామని అమీ చెబుతోంది. కాస్త పెద్ద కార్యక్రమంగా చేయాలనుకుని ఎక్కువ డబ్బులు ఇస్తే గట్టిగా ఏడుస్తామని, తక్కువ డబ్బులు ఇస్తే చిన్నగా ఏడుస్తామని వివరించింది. ఎంత పిండికి అంత రొట్టె అన్న మాట!

మరిన్ని వార్తలు