-

శోకసంద్రంలో క్యూబా

12 Dec, 2016 15:23 IST|Sakshi
శోకసంద్రంలో క్యూబా

ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో అంతటా విషాదం
 

 హవానా: కమ్యూనిస్టు నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణంతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం దేశమంతటా ప్రజల విషాద వదనాలతో నిశ్శబ్దం అలముకుంది. ఎక్కడా ఎలాంటి అధికారిక కార్యక్రమాలనూ నిర్వహించలేదు. 50 ఏళ్లు పాలన సాగించిన క్యాస్ట్రో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా తుది వీడ్కోలు పలికెందుకు దేశం సిద్ధమవుతోంది.  సంతాప సభలు, 4 రోజుల పాటు ఆయన పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబరు 4న శాంటియాగోలో అంత్యక్రియలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. క్యాస్ట్రో 1953లో శాంటియాగో నుంచే విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి క్యాస్ట్రో(90) అనారోగ్యంతో తుది శ్వాస విడవడం తెలిసిందే.  హవానాలోని చారిత్రక రివల్యూషన్ స్క్వేర్‌లో సంతాప సభలు సోమవారం మొదలవుతాయి.  

 నా జీవితం కంటే ఎక్కువ...
 క్యాస్ట్రో మరణంతో క్యూబన్ల గుండెలు పగిలారుు. ‘ఏం చెప్పగలను? క్యాస్ట్రో నా జీవితం కంటే ఎక్కువ’ అని కన్నీటి పర్యంతమయ్యారు 82 ఏళ్ల ఆరోరా మెండెజ్. పేదల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ప్రస్తుత క్యూబా జనాభాలో చాలామంది పుట్టక ముందే క్యాస్ట్రో పోరాటం, ధీరత్వం... స్కూలు పుస్తకాలు, పత్రికలన్నింటా నిండిపోయారుు. మార్గదర్శకుడిగా నిలిచి, సామాజిక, ఆర్థిక అసమానతలు లేకుండా దేశానికి దిశానిర్దేశం చేసిన యోధుడు లేకుండా వారు తమ జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు. కొందరు ఆందోళన చెందుతుంటే... ఆయన నింపిన విశ్వాసంతో దేశం ముందుకు సాగుతుందని మరికొందరు ఆశిస్తున్నారు. కొందరు మాత్రం... ఫిడెల్ మరణంతో ఆయన తమ్ముడు, అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుం దని భావిస్తున్నారు.

 అంత్యక్రియలకు క్యాస్ట్రో సోదరి దూరం
 మయామి: ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలకు ఆయన సోదరి జువానిత హాజరుకాబోవడం లేదని అమెరికా మీడియా పేర్కొంది. ‘ఫిడెల్ అంత్యక్రియలకు వెళుతున్నానన్న ఊహాగా నాల్లో నిజం లేదు. తిరిగి క్యూబాకు వెళ్లే ప్రసక్తే లేదు’ అని దశాబ్దాలుగా అమెరికాలోని మియామీలో ఉంటున్న జువానిత చెప్పారని వెల్లడించింది. ఫిడెల్ కమ్యూనిస్టు ప్రభుత్వా న్ని జువానిత బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. క్యాస్ట్రోను తొలగించేం దుకు సీఐఏకు సహకరించారని ఆమెపై ఆరోపణలున్నారుు.

మరిన్ని వార్తలు