కరెంటు దుస్తులు వస్తున్నాయ్‌...

25 May, 2017 03:01 IST|Sakshi

వాషింగ్టన్‌: మానవుని శరీర కదలికల ద్వారా విద్యుదుత్పత్తి చేసే దుస్తులు త్వరలో రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి మాసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త కోటింగ్‌ ప్రక్రియను కనుగొన్నారు.  మానవుని వెంట్రుకలో 1/10 వంతు మందంతో దుస్తులపై 3,4 ఎథిలిన్‌డైఆక్సీటైయోఫైన్‌ అనే పాలిమర్‌ను కోటింగ్‌ చేశామని, దీంతో కొన్ని మైక్రో వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యిందని శాస్త్రవేత్త త్రిషా ఆండ్రూ తెలిపారు. మనిషి కదలికల వలన రెండు ఎలక్ట్రోడ్‌ల మధ్య రాపిడి జరిగి విద్యుదుత్పత్తి అవుతుందని ఆమె వివరించారు.

  ఇప్పటి వరకు సిల్క్, లెనిన్, కాటన్‌ దుస్తులపై  దీనిని పరీక్షించామని చెప్పారు. ఈ దుస్తులను ఉతికినా, ఇస్త్రీ చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె వెల్లడించారు. రానున్న కాలంలో  ఈ దుస్తులు మిలటరీ, హెల్త్‌ కేర్‌ ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగ పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు