చార్జింగ్‌కి సైక్లింగ్‌

26 Apr, 2017 02:56 IST|Sakshi
చార్జింగ్‌కి సైక్లింగ్‌

కాలంలో ఏమున్నా.. లేకపోయినా.. స్మార్ట్‌ఫోన్‌లో చార్జింగ్‌ మాత్రం ఫుల్లుగా ఉండాల్సిందే. బ్యాటరీ ఖర్చవుతున్న కొద్దీ చాలామందిలో టెన్షన్‌ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఇకపై బేఫికర్‌గా ఉండవచ్చు. ఎలాగంటే.. పక్క ఫొటో చూడండి. వీచే గాలితోనేకాదు. పారే నీటితోనూ కరెంటు పుట్టిస్తుంది ఈ బుల్లి పరికరం. పేరు ‘వాటర్‌లిలీ’.  కెనడాకు చెందిన సీఫార్మాటిక్స్‌ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్‌.. బ్యాగులో పట్టేసేంత చిన్న సైజులో ఉంటుంది.

చాలా నెమ్మదిగా పారే నీటిలోనూ దాదాపు 25 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. బరువు కూడా 800 గ్రాములకు మించదు. బాగానే ఉందిగానీ.. గాలి, నీరు లేకపోతే ఏం చేయాలి? చాలా సింపుల్‌. చక్రాన్ని నేరుగా చేత్తో తిప్పినాసరే.. కరెంటు పుడుతుందని కంపెనీ చెబుతోంది. మోటర్‌బైక్‌ ముందో, వెనుకో తగిలించుకుంటే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నా చెక్కుచెదరదని అంటోంది. అన్నీ సవ్యంగా సాగితే మరో మూడు నాలుగు నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ గాడ్జెట్‌ ఖరీదు ఏడు వేల వరకూ ఉండవచ్చునని అంచనా.

మరిన్ని వార్తలు