గెలిచిన ట్రోఫీతో న్యూడ్ గా...

25 May, 2016 13:40 IST|Sakshi
గెలిచిన ట్రోఫీతో న్యూడ్ గా...

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో  డెన్మార్క్కు చెందిన మహిళల హ్యాండ్ బాల్ జట్టు చివరకు గెలుపొందింది. దీంతో ఆ విజయాన్ని  ఆస్వాదిస్తూ, ఏకంగా బాత్ రూంలోని షవర్ కింద జట్టు సభ్యులు ట్రోఫీతో న్యూడ్ గా ఫోజిచ్చారు. గత నాలుగేళ్లలో మూడుసార్లు డెన్మార్క్కు చెందిన ట్విస్ హోల్స్టెబ్రో మహిళల హ్యాండ్ బాల్ జట్టు ఈఎచ్ఎఫ్ కప్  కైవసం చేసుకుంది.

అయితే ఈ సారి జరిగిన ఫైనల్ మ్యాచ్లో రష్యాకు చెందిన హ్యాండ్ బాల్ జట్టు గట్టి పోటీనిచ్చింది. తొలుత రష్యాకు చెందిన మహిళల టీం ఆధిక్యం కనబరిచింది. అయితే చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో  డానిష్ మహిళల జట్టు విజయం సాధించింది.  దీంతో ఈ ఏడాది కప్ గెలుపును మరచిపోకుండా ఉండటానికి జట్టు సభ్యులైన కొందరు మహిళలు గెలిచిన కప్తో న్యూడ్గా ఫోటోకి ఫోజిచ్చారు.


 

మరిన్ని వార్తలు