క్యా‘కరోనా’- ఈ పరుగు ఆగెదెన్నడు!

29 Mar, 2020 13:06 IST|Sakshi

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా కబంధ హస్తాల్లో చిక్కిన ప్రపంచ దేశాల జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకట్లు, పదులు, వందలు దాటి నేడు రోజూ వేల మంది ఈ ప్రాణాంతక వైరస్‌ దెబ్బతో ప్రాణాలు విడుస్తున్నారు. చైనాలో మొదలైన కోవిడ్‌-19 విజృంభణ యూరప్‌, ఉత్తర అమెరికా ఖండాల్లో మరీ ఎక్కువగా ఉంది. రోజూ వందల మరణాలు సంభవిస్తున్న ఇటలీలో శుక్రవారం ఏకంగా వెయ్యి మంది మృతి చెందారు. శనివారం మరో 899 మంది ప్రాణాలు విడిచారు. దీంతో 10 వేల మరణాలతో ఇటలీ కోవిడ్‌-19 మృతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 
(చదవండి: కరోనా వైరస్‌తో స్పెయిన్‌ యువరాణి మృతి)

స్పెయిన్‌లోనూ అదే స్థాయిలో మృతుల సంఖ్య ఉంది. శనివారం అక్కడ 844 మంది ప్రాణాలు విడువడంతో మొత్తం మరణాల సంఖ్య 5982 కు చేరి రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో చైనా (3,300) , అమెరికా (2229)గా దేశాలు ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం నాటికి ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 60 వేలకు పైగా కేసులు నమోదు కాగా...30 వేలకు ప్రజలు మృతి చెందారు. భారత్‌లో 987 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 25 మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణలో 67 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 కేసులు నమోదయ్యాయి.
(చదవండి: క్వారంటైన్‌ కేంద్రం ఎలా ఉంటుందంటే..)

మరిన్ని వార్తలు