ఇరాక్‌ సైన్యం కాల్పుల్లో 27 మంది మృతి

29 Nov, 2019 05:47 IST|Sakshi

సిరియా: ఇరాక్‌ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. నజాఫ్‌ నగరంలోని ఇరాన్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి నిరసనకారులు బుధవారం అర్థరాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఇరాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామ అనంతరం నజాఫ్‌తోపాటు మిగతా నగరాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు బలగాలను భారీగా మోహరించింది. దీంతో నజాఫ్‌లో రెండు కీలక వంతెనలపై బైఠాయించిన ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేసేందుకు బలగాలు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోగా 165 మందికి పైగా గాయపడ్డారు. బాగ్దాద్‌లో రక్షితప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన నిరసనకారులపైకి బలగాలు కాల్పులు జరపగా నలుగురు చనిపోగా 22 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా