క‌ల్తీ మ‌ద్యం..18కి చేరిన మ‌ర‌ణాలు

9 Jun, 2020 08:27 IST|Sakshi

మెక్సికో :  క‌ల్తీ మ‌ద్యం తాగి మర‌ణించిన వారి సంఖ్య 18కు చేరుకుంది. సోమవారం ఒక్క‌రోజే 10 మంది మృత్యువాత ప‌డ‌గా, మ‌రో 16మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.  మెథ‌నాల్ క‌లిపిన క‌ల్తీ మ‌ద్యాన్ని తాగ‌డంతోనే వీరి చ‌నిపోయార‌ని వైద్యాదికారులు పేర్కొన్నారు. వీరంతా ట్లాపా డి కామ‌న్ ఫోర్డ్ ప‌ట్ట‌ణం, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నివాసితులుగా గుర్తించిన అధికారులు వ్య‌వ‌సాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నార‌ని తెలిపారు. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం అందుబాటులో ఉండ‌టంతో ఎక్కమంది దీనికి బానిస‌లుగా మారారు.
(నేపాల్‌లో స్కూళ్ల నిర్మాణానికి భారత్‌ సాయం! )

'రాంచో ఎస్కోండిడో' అని పిలిచే ఈ పానీయంలో విష ప‌దార్థాలు క‌ల‌వ‌డంతోనే ప్రాణాలు విడిచారాని అధికారులు వెల్ల‌డించారు. ఈ ప్రాంతంలోని నాలుగు దుకాణాల నుంచి 505 క‌ల్తీ మ‌ద్యం సీసాల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక లాక్‌డౌన్ ప్రారంభం అయిన‌పప్ప‌టి నుంచి అన్నిర‌కాల మ‌ద్యం అమ్మ‌కాల‌పై ప్ర‌భుత్వం నిషేధం విధించింది. దీంతో త‌క్కువ ధర‌కే కల్తీ మ‌ద్యం దొరుకుతుంద‌ని చాలామంది నిరుపేద‌లు దీనికి అల‌వాటు ప‌డ్డారు. ఫ‌లితంగా దీని కార‌ణంగా మే నెల‌లోనే 40 మంది చ‌నిపోగా ప్ర‌స్తుతం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 
(మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనా! )

మరిన్ని వార్తలు