ఇరాక్‌ నిరసనల్లో 28 మంది మృతి

4 Oct, 2019 03:56 IST|Sakshi

బాగ్దాద్‌: అవినీతి, నిరుద్యోగాలకు వ్యతిరేకంగా ఇరాక్‌ పౌరులు గత మూడు రోజులుగా కొనసాగిస్తున్న నిరసనలు గురువారానికి దక్షిణానికి విస్తరించాయి. ఇప్పటి వరకు ఈ నిరసనల్లో జరిగిన హింసలో 28 మంది చనిపోయారు. 600 మందికి పైగా నిరసనకారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు కాల్పులు, వాటర్‌ కెనాన్స్, భాష్పవాయు ప్రయోగాలకు వెరవకుండా ఇరాకీలు, ఎవరి నాయకత్వం లేకుండానే, ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి అదెల్‌ అబ్దెల్‌ మెహదీకి ఈ నిరసనలు పెద్ద సవాలుగా మారాయి.  షియాలు ఎక్కువగా ఉండే పట్టణాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనల్లో ప్రధాన రాజకీయ పార్టీల జోక్యాన్ని నిరనసకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విశేషం. 

మరిన్ని వార్తలు