కలిసి భోంచేశారు

21 Jun, 2019 13:16 IST|Sakshi

ఇరవై మూడేళ్ల అమెరికన్‌ మోడల్, టెలివిజన్‌ స్టార్‌ కెండెల్‌ జెన్నెర్, ఆమెకన్నా పదేళ్లు పెద్దదైన మన దీపికా పడుకోన్‌ ఇద్దరూ కలిసి మంగళవారం న్యూయార్క్‌లోని ప్రెస్బిటేరియన్‌ హాస్పిటల్‌లో లంచ్‌ చేశారు. హాస్పిటల్‌లో లంచ్‌ ఏమిటి?! హాస్పిటల్‌లో లంచ్‌ కాదు. హాస్పిటల్‌ వాళ్లు ఏర్పాటు చేసిన లంచ్‌ అది. న్యూయార్క్‌లోనే ఉన్న ‘యూత్‌ యాంగ్జెయిటీ సెంటర్‌’ కోసం నిధులను సమీకరించే ఒక కార్యక్రమ ప్రారంభోత్సవం అనంతర దీపిక, కెండెల్‌తో మరికొందరు ప్రముఖులు కలిసి విందును ఆరగించారు. అంతకన్నా ముందు దీపిక తన ప్రసంగంలో తనెలా డిప్రెషన్‌ నుంచి బయటపడిందీ అక్కడివారితో షేర్‌ చేసుకున్నారు. యువతలో కనిపించే ఆదుర్దా, ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు యాత్‌ యాంగ్జెయిటీ సెంటర్‌ చికిత్సను అందించడంతో పాటు సంబంధిత వైద్యపరిశోధనలు, అధ్యయనాలు జరుపుతుంటుంది. దీపిక అంటే ఒకే, మరి కెండెల్‌ అక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఆమెరికన్‌ల యూత్‌ ఐకన్‌ ఇప్పుడు ఆవిడ.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు