ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

1 Oct, 2016 09:05 IST|Sakshi
ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులకు అసలు ప్రజాస్వామ్యం సరికాదని, అందువల్లనే దేశ వ్యవహారాల్లో ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా చెప్పుకున్నవారు సరిగా పనిచేయనందున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాలనలో ఆర్మీనే కీలకంగా వ్యవహరిస్తోందని వాషింగ్టన్ ఐడియాస్ ఫోరం ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్యం లేదని ఇది పాక్‌కు ఉన్న వారసత్వ బలహీనత అని ముషారఫ్ పేర్కొన్నారు.

పాకిస్తాన్ ప్రజలు సమస్యల పరిష్కారానికి సైన్యం వైపు చూస్తారని అందువల్లనే సైన్యం ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం కావడం మూలంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని సైనిక తిరుగుబాటు చర్యలను ఆయన సమర్థించారు. పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ నుంచి ఎక్కువ ఆశిస్తారని ఆయన వెల్లడించారు. పాక్ ఆర్మీతో సుమారు 40 ఏళ్ల అనుబంధం ఉందని.. ఆర్మీ తనను సపోర్ట్ చేయడం పట్ల గర్వపడతానని.. సైన్యమే తనకు రాజ్యాంగం అని ముషారఫ్ ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. దేశంలో రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని ముషారఫ్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు