ఆ రోబోను చంపొద్దంటూ వినతులు!

26 Jun, 2016 10:55 IST|Sakshi
ఆ రోబోను చంపొద్దంటూ వినతులు!

పెర్మ్: రష్యాలోని పెర్మ్ నగరంలో ఇటీవల సైంటిస్టుల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చిన ప్రోమోబోకు అక్కడి ప్రజల మద్దతు పెరుగుతోంది. కస్టమర్ రిలేషన్స్లో సహాయకారిగా పనిచేసేందుకు తయారు చేసిన ఈ రోబో.. రోడ్డుమీద చెక్కర్లు కొట్టడానికి వెళ్లడంతో తయారీదారులు దానిని రీసైక్లింగ్ చేయాలని భావించారు. అయితే.. అనూహ్యంగా ప్రజలు రోబోకు మద్దతు పలుకుతూ దానిని చంపొద్దంటూ శాస్త్రవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఒక్కసారి కలిసిన కస్టమర్ను కూడా ఎప్పటికీ గుర్తుంచుకొని వారికి సహాయం అందించేలా ప్రోమోబో రూపొందించబడింది. ఇది కొత్త కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి తోడ్పడుతుంది. అయితే, అనూహ్యంగా అది రోడ్డు మీదకు వచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకోవటంతో.. దానికి గల తిరగాలనే కాంక్షే దానిని రోడ్డు మీదకు రప్పించిందనీ, అంతమాత్రానికే దానిని చంపేస్తారా అంటూ పలువురు రోబో తరపున శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తున్నారు.  దాని ఫ్రీడం కోసమే అది ఇలా చేసిందని కొందరు అంటుంటే.. మరికొ్ందరు మాత్రం అది అలా ప్రవర్తించడానికి గల కారణాన్ని తెలుసుకొని సరిచేస్తే సరిపోతుందని దానిని రీసైక్లింగ్ చేయొద్దని సోషల్ మీడియాలో తయారీదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు