ఆ దెయ్యాల కంట పడ్డారో.. అంతే?!

28 Oct, 2017 13:00 IST|Sakshi

దయ్యాలు.. ఆత్మలు గురించి మాట్లాడుతుంటే.. ఇంకా ఈ కాలంలో వాటి గురించి చర్చించే వాళ్లున్నారా? అని వింతగా చూస్తారు. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే.. అబ్బే అవన్నీ ఉత్తి మాటలని కొట్టి పారేస్తాం. ఆత్మలు, దయ్యాలు అనేవి లేవు.. మన భ్రమ అని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. మీరు నమ్మినా నమ్మకపోయినా.. అక్కడ మాత్రం దయ్యాలున్నాయి.

బ్రిటన్‌.. ఆధునికతకు మారు పేరుగా నిలిచన దేశం. ఇక్కడున్న యార్క్‌షైర్‌, విల్ట్‌షైర్‌, నర్‌ఫోక్‌, కుంబ్రియా, స్టాఫోర్డ్‌షైర్‌, ఎడ్విన్‌ బర్డ్‌, ఇజిల్‌ ఆఫ్ వెయిట్‌, లండన్‌ ప్రాంతాల్లో దయ్యాలు విరివిగా తిరుగుతున్నాయి. ఏదో ఒకటిరెండు కాదు.. వందల సంఖ్యలో ఆత్మలు, దయ్యాలు సంచరిస్తున్నాయట.

యార్క్‌షైర్‌ :
ఈ ప్రాంతాన్ని బ్రిటన్‌లో దయ్యాల అడ్డాగా పిలుస్తారు. ఇక్కడ రమారమీ 607 దయ్యాలను ప్రజలు గుర్తించారట. బ్రాడ్‌ఫోర్డ్‌లోని గోల్ఫ్‌ కోర్ట్‌ దగ్గర రాత్రి సమయాల్లో దయ్యాలు సంచరిస్తాయట. తూర్పు యార్క్‌షైర్‌ ప్రాంతంలోనూ.. అతీత శక్తులు తిరుగాడుతాయట. ఈ ప్రాంతంలో 1960-70 మధ్యనివసించిన ఒక దొంగ సాధువు.. అనేకమందిని హత్య చేశాడట. కొన్నాళ్లుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. దొంగ సాధువు చేతిలో అమాకయంగా హతులైన వారు.. చివరకు దొంగ సాధువు కూడా దయ్యాలై ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారని ఒక కథనం ఉంది. ఇది నిజమని చాలా మంది విశ్వాసం.

విల్ట్‌షైర్‌:
 విల్ట్‌షైర్‌, నోర్‌ఫోక్‌ ప్రాంతంలోని అడవుల్లో సుమారు 28 దయ్యాలు తిరుగుతున్నాయట. ఇవి చాలా వరకు నల్లటి భీకరమైన కుక్కలా కనిపిస్తాయని.. మనిషి కనిపిస్తే.. వెంటాడి వేటాడతాయని ప్రజలు చెబుతున్నారు.

స్టాఫొర్డ్‌షైర్‌ :
ఈ ప్రాంతంలో 2007 నుంచి భీకరమైన తోడేలు రూపంలో దయ్యాలు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీటిపైన వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ ఘోస్ట్ క్లబ్‌ వారు పరిశోధనలు సైతం చేశారు. ఎవరైనా రాత్రి పూట ఒంటరిగా నడుస్తున్న సమయంలో.. ఈ తోడులు వెనకగా వస్తుందట.. మనిషి దానిన గమనిస్తే.. బిగ్గరగా అరిచి.. భయపెడుతుందట.

లండన్‌ :
గ్రేటర్‌ లండన్‌లోనూ ప్రజలకు ఇటువంటి అనుభవాలున్నాయట. సుమారు 547 మంది ప్రజలు వీటి బారిన పడి ఇబ్బందులు పడ్డారట.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు