ఆస్కార్‌ అవార్డును సీటు కింద దాచిపెట్టాడు

11 Feb, 2020 14:38 IST|Sakshi

లాస్‌ ఏంజెల్స్‌ : హాలీవుడ్‌ డైరెక్టర్ టైకా వైటిటి చేసిన ఒక చిలిపి పని ఇప్సుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లాస్‌ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో  జోజో రాబిట్‌ సినిమాకు బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో టైకా వైటిటి ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా అవార్డు కార్యక్రమం మధ్యలో తైకా వెయిటిటి తన అవార్డ్‌ను తన ముందున్న సీటు కింద దాచిపెట్టాడు. దీనిని గమనించిన హాలివుడ్‌ నటి బ్రీ లార్సన్‌ తన ఫోన్‌ కెమెరాలో బంధించి ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే తైకా ఈ పని చేస్తుండగా తనకు తెలియకుండానే బ్రీ లార్సన్‌ కెమెరాకు చిక్కాడు. ఆ తర్వాత తన చేతిలో ఏ అవార్డు లేదంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. అయితే ఇదంతా లార్సన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది ‍కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన నెటిజన్లు' టైకా వెయిటి! మీ చిలిపి పని బాగుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు