‘ఏఐ’ రంగంలోనూ లింగ వివక్షతనా ?

19 Aug, 2019 19:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)’ అంటే కత్రిమ మేధస్సు దినదినం అభివద్ధి చెందుతూ ఎక్కడికో పోతోంది. ‘గో’ లాంటి గేముల్లో మానవ ప్రపంచ ఛాంపియన్లను సైతం ఓడించి మానవ శరీరంలోని క్యాన్సర్‌ కణతులను మెడికల్‌ స్కాన్‌ ద్వారా రేడియోలాజిస్టులకన్నా అద్భుతంగా గుర్తిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరెక్కడికో తీసుకెళుతున్న కత్రిమ మేధస్సులో ఓ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్టీమ్‌ ఇంజన్, ఎలక్ట్రిసిటీ, రేడియోలతో కత్రిమ మేధస్సును ఆర్థిక వేత్తలు అభివర్ణిస్తున్న సమయంలో ఇందులో లింగ వివక్ష కనిపిస్తోంది.

సమష్టి నిర్ణయంతో కత్రిమ మేధస్సుకు సజనాత్మకతను తీసుకరావాల్సిన సమయంలో లింగ వివక్ష వల్ల ఈ రంగంలోకి మహిళలను ఎక్కువగా ఆహ్వానించక పోవడం వల్ల భవిష్యత్‌లో అనూహ్య ముప్పును ఎదుర్కొనాల్సి రావచ్చు. ఇప్పటికీ ‘అమెజాన్‌ ఈ కామర్స్‌’ కంపెనీ ద్వారా మహిళలకు ముప్పు వాటిల్లుతోంది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలను అమెజాన్‌ కంప్యూటర్లు పేర్ల ద్వారా గుర్తుపట్టి ఏరివేస్తోంది. ఏఐ సదస్సులో పాల్గొంటున్న పరిశోధకుల్లో మహిళలు 20 శాతం కన్నా తక్కువగా ఉంటున్నారు. బర్కిలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో చదువున్న ఏఐ మహిళా అండర్‌ గ్రాడ్యువేట్లలో నాలుగు వంత మాత్రమే పరిశోధనల్లో పొల్గొంటున్నారు.

1990 దశకం నుంచి కత్రిమ మేధస్సు రంగంలో మహిళల ప్రాతినిధ్య శాతం ఏమాత్రం పెరగలేదు. అయితే నెదర్లాండ్స్, నార్వే, డెన్మార్క్‌ దేశాల ఏఐ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కొంచెం ఎక్కువగా ఉండగా, జపాన్, సింగపూర్‌ దేశాల్లో మహిళల ప్రాతినిధ్యం మరీ తక్కువగా ఉంది. శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక రంగం, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్‌ రంగాల్లో లింగ వైవిధ్యం లేకపోతే సమగ్ర ప్రగతి అసాధ్యం. కత్రిమ మేథస్సు రంగం ప్రశ్న పత్రాల రూపకల్పనలో కూడా మహిళల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రశ్న పత్రాల్లో వైవిధ్యం కనిపించదు. వైవిద్యం ఉన్నప్పుడే పురోగతి, ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఏఐ రంగంలో వైవిధ్యతను పెంచేందుకు, అంటే మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్రం 117 కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ మహిళల ప్రాధాన్యత పెరగక పోవడం శోచనీయం. నేడు మీడియాకు నకిలీ వార్తలు ముప్పుతెస్తున్నట్లే లింగ వివక్ష కారణంగా ఏఐ రంగానికి ముప్పు రావచ్చు.

మరిన్ని వార్తలు