విమాన బాధితుల డీఎన్ఏ పరీక్షలు పూర్తి

30 Mar, 2015 09:06 IST|Sakshi

ప్యారిస్: జర్మన్ విమాన ప్రమాదంలో మృతిచెందినవారిని గుర్తించేందుకు కావాల్సిన డీఎన్ఏ పరీక్షలు పూర్తయినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. మొత్తం 150 మంది ప్రయాణీకుల్లో 78 మంది డీఎన్ఏ పరీక్షలు తేలాల్సి ఉండగా వాటిని కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే, వారి పేర్ల జాబితా ఇంకా విడుదల చేయలేదని, మరోసారి క్రాస్ చెకింగ్ అయిపోయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఈ ప్రమాదంలో మిగిలిపోయిన ప్రయాణీకులకు చెందిన శిథిల రూప శకలాలను 50 హెలికాప్టర్లలో తరలిస్తున్నామని, చిద్రమైన శరీరభాగాలను ఓ చోటచేర్చేందుకు 50మంది విమానం కూలిపోయిన పర్వత ప్రాంతంలో గాలింపులు చేపడుతున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానం 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు.

మరిన్ని వార్తలు