లైఫ్‌ పార్ట్‌నర్‌ ఆన్‌లైన్‌ యాక్టివిటీపై కన్నేశారా?

20 Feb, 2018 18:31 IST|Sakshi

దుబాయ్‌ : దాంపత్యజీవితం సుఖసంతోషాలతో నడవాలంటే ప్రేమ అనురాగాలతో పాటు నమ్మకం చాలా అవసరం. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా నేటి స్మార్ట్‌ యుగంలో బతకడం కష్టం. చాలా మంది తమ రోజు మొత్తంలో ఎన్నో విషయాలు తమ ఫోన్ల ద్వారానే మాట్లాడుతుంటారు. తమ ప్రైవసీలో ఫోనుకు మొదటి భాగం ఇస్తుంటారు. వాటికి పాస్‌వర్డ్‌లు, పిన్‌లాక్‌లు పెట్టుకుంటారు. కానీ పెళ్లి తర్వాత తమ భార్య లేదా భర్త గురించి పూర్తిగా అన్ని విషయాలను తెలుసుకోవాలి అనుకుంటారు. ఈ విషయంపై కాస్పెర్స్కే ల్యాబ్ అనే రష్యా ఆధారిత సైబర్ యాంటి-వైరస్ ప్రొవైడర్ యుఎఇలో ఇంటర్‌నెట్‌ వినియోగదారులపై ఓ సర్వేని నిర్వహించింది.

అందులో 36 శాతం మంది తమ భార్య లేదా భర్త ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్‌ చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తేలింది. నిలకడ లేని సంబంధాలు కలిగి ఉన్న వారిలో  45 శాతం మంది ఉన్నారు. ప్రతి పది మందిలో ఆరుగురు తమ ఫోన్‌ పాస్‌వర్డ్‌లను తమ జీవితభాగస్వామితో పంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. దాని వల్ల తమ మధ్య నమ్మకం బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

మరికొంత మంది మాత్రం జీవితంలో ఒకరి గురించి ఒకరు చాలా వరకు తెలుసుకున్న ఎంతకొంత ప్రైవేట్‌ లైఫ్‌ ఉండి కొంత ప్రైవసీ ఉండాలంటున్నారు. ఒక వ్యక్తి తన భార్య ఫేస్‌బుక్‌లో ఎవరితో చాట్‌ చేస్తుందో తెలుసుకోవాలని ఉంటుందని, ఎందుకంటే మహిళలకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది అపరిచితుల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్టులు వస్తాయని వాటి నుంచి తన భార్యను కాపాడుకోవడం కోసం తన ఫోన్‌ పాస్‌వర్డ్‌ తెలుసుకుని తన ఫోన్‌ను చెక్‌ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మరోకరు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే చాలని ప్రైవసీ కంటే రిలేషన్‌షిప్‌ చాలా ముఖ్యమని తెలిపారు.

మరిన్ని వార్తలు