పుతిన్‌ను కలిసిన డాక్టర్‌కు పాజిటివ్‌

1 Apr, 2020 07:03 IST|Sakshi

మాస్కో: గతవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలిసిన ఒక డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మాస్కోలోని ప్రత్యేక కరోనా ఆసుపత్రి చీఫ్‌గా పనిచేస్తున్న డెనిస్‌ ప్రాట్సెంకొ గత మంగళవారం పుతిన్‌ కొమునార్క ఆసుపత్రిని సందర్శించిన సమయంలో పుతిన్‌తో పాటు ఉన్నారు. ఆ డాక్టర్‌కు కరోనా సోకినట్లుగా తాజాగా నిర్ధారణ అయింది. అయితే, హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలో పుతిన్‌ హజ్మత్‌ సూట్‌ను ధరించి ఉన్నారు. పుతిన్‌కు ఆరోగ్య పరీక్షలు జరిగాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రష్యా ప్రకటించింది. (విదేశాల్లోనూ టీకాను పరీక్షిస్తాం: చైనా )
చదవండి:
 పేషెంట్‌ జీరో ఎవరు?

మరిన్ని వార్తలు