జంతు మార్కెట్లవుతున్న ల్యాబ్‌లు

12 Feb, 2020 16:00 IST|Sakshi

సార్స్, ఎబోలా, మెర్స్, చికెన్‌ గున్యా, జికా, ఇప్పుడు కరోనా వైరస్‌ ముందుగా జంతువులకు వచ్చి అటు నుంచి మనుషులకు సోకినట్లు వైద్యులు భావిస్తున్న విషయం తెలిసిందే. చైనా, వుహాన్‌లోని ‘హువానన్‌ సీఫుడ్‌ మార్కెట్‌’ నుంచి కరోనా వైరస్‌ వ్యాపించిందని చైనా వైద్యులు నిర్ధారించారు. ఆ మార్కెట్‌లో చేపలు, రొయ్యలు,పీతలలాంటి జలచరాలతో పాటు కోళ్లు, కొంగలు,సజీవ కుందేళ్లు,ఎలుకలు, గబ్బిళాలు, ఇతర వన్యప్రాణులను విక్రయిస్తుండం వల్ల కొత్తరకం కరోనా వైరస్‌ ఆవిర్భవించిందని వైద్యులు అనుమానిస్తున్నారు.(కోవిడ్‌-19 : 18 నెలల్లో తొలి వ్యాక్సిన్‌ )


భిన్న రకాల జంతువులు, ప్రాణులు ఒక చోట ఉండడం వల్ల వైరస్‌లు ఎలా పుడుతున్నాయో తెలుసుకోవడం ద్వారా, వాటి నివారణ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచంలోని పలు దేశాల్లో వైద్యులు పరిశోధనలు సాగిస్తున్నారని అమెరికాలోని కొలరాడో స్టేట్‌ యూనివర్శిటీ బయోమెడికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ రిచర్డ్‌ బోవెన్‌ తెలిపారు. ఇందుకోసం అమెరికా, ఇండోనేసియా సహా పలు దేశాల ల్యాబుల్లో పలు రకాల జంతువులను నిర్బంధించి అధ్యయనం చేస్తున్నారు. కరోనా వైరస్‌పై జరగుతున్న పరిశోధనలు కూడా త్వరలోనే ఫలించే అవకాశం ఉందని బోవెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బర్డ్‌ ఫ్లూ కోసం మందు కనుక్కోవడం కోసం వైద్యులు కోళ్లు, కొంగలు, పావురాలు, ఎలుకలను ఒక చోట ఉంచి పరిశోధనలు జరిపి విజయం సాధించారట.(‘కరోనా’ను అడ్డుకునే మాస్క్‌లేమిటి?)

>
మరిన్ని వార్తలు