అమ్మో..కణితి

6 May, 2018 03:06 IST|Sakshi

అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం డాన్‌బరిలోని ఓ ఆస్పత్రిలో 38 ఏళ్ల మహిళ అండాశయం నుంచి తొలగించిన 60 కిలోల కణతి ఇది. రెండు నెలల పాటు వారానికి అసాధారణంగా 5 కిలోల చొప్పున బరువు పెరుగుతున్నట్లు గుర్తించిన ఆమె వైద్యులను సంప్రదించడంతో అది కణతి అని తెలిసింది. దాని పరిమాణం రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆమె జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతో ఆమెకు తక్కువ పోషకాలు ఉన్న ఆహారమిచ్చి క్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారా ఫిబ్రవరిలో కణతిని విజయవంతంగా తొలగించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది.     

మరిన్ని వార్తలు