గూగుల్ క్రోమ్తో ల్యాప్టాప్ బ్యాటరీ డెడ్!

22 Jun, 2016 10:28 IST|Sakshi
గూగుల్ క్రోమ్తో ల్యాప్టాప్ బ్యాటరీ డెడ్!

ల్యాప్టాప్ బ్యాటరీ తొందరగా డెడ్ అవుతోందా.. దానికి కేవలం మీ లాప్టాప్ తయారీ సంస్థను మాత్రమే నిందించాల్సిన అవసరం లేదు. అందులో మీరు వాడే బ్రౌజర్లు కూడా.. బ్యాటరీ ఎంత వేగంగా ఖర్చవుతుంది అనే విషయాన్ని నిర్ణయిస్తాయని మైక్రోసాఫ్ట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను వాడే ల్యాప్టాప్లలో బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందని నిర్థారించారు.

ఇందులో భాగంగా గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లాంటి వివిధ బ్రౌజర్లతో ఉన్న ఒకే తరహా ల్యాప్టాప్లను లైవ్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా పరీక్షించగా.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న ల్యాప్టాప్ బ్యాటరీ త్వరగా డెడ్ అవటం గమనించారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న ల్యాప్టాప్ బ్యాటరీ అతి తక్కువ సమయం 4:19 గంటలు పనిచేయగా.. మొజిల్లా 5:09 గంటలు, ఒపేరా 6:18 గంటలు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కలిగిఉన్న ల్యాప్టాప్ అత్యధికంగా 7:22 నిమిషాలు పనిచేసినట్లు గుర్తించారు. అయితే బ్యాటరీ సేవింగ్ విషయంలో ఇటీవలి కాలంలో గూగుల్ క్రోమ్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ కంపెనీ ప్రతినిథి తెలిపారు.
 

మరిన్ని వార్తలు