లాక్‌డౌన్‌లో ఈ కుక్క ఏం చేసిందో తెలుసా?

4 May, 2020 14:14 IST|Sakshi

లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు? అంటే ఠ‌క్కున వినిపించేవి.. తిన‌డం, తొంగోవ‌డం. పోనీ ఈ రెండింటి మ‌ధ్య‌లో ఏం చేస్తున్నారూ? అంటే ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అంటూ ప‌నిలో... పిల్ల‌ల నుంచి పెద్ద‌ల దాకా టిక్‌టాక్‌, ఫోన్ కాల్స్‌, చాటింగ్‌, వీడియో కాల్స్‌, వెబ్ సిరీస్‌.. అబ్బో.. ఈ లిస్టు చాలా పెద్ద‌ది. మ‌నుషుల సంగ‌తి స‌రే, మ‌రి జంతువులు.. పాపం, బ‌య‌ట‌కెళ్లి ఆడుకోలేవు, తోటి జంతువుల‌ను చూడ‌నూ లేవు. ఇక‌ ఇంట్లో మ‌నుషుల‌ను చూసి చూసీ వాటికీ తెగ బోర్ కొట్టేస్తున్నాయి. ఇది గుర్తించిన లైకా అనే పెంపుడు కుక్క య‌జ‌మాని జెరెమీ హోవార్డ్‌ ఓ ఐడియా వేశాడు. (పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా )

త‌న కుక్క బెస్ట్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేశాడు. ఇంకేముందీ వీడియో కాల్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన త‌న స్నేహితుడు హెన్రీని చూసి ఈ పెంపుడు కుక్క‌ది ఒక అరుపు కాదు.. అక్క‌డ హెన్రీ కూడా ప‌ట్ట‌లేని సంతోషంతో గ‌దిలో గెంతులు వేస్తున్నాడు. కానీ వీళ్లేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క అర్థం కాదు లెండి. వీటి ఆనందాన్ని అంత‌టినీ కెమెరాల్లో బంధించిన హోవార్డ్‌ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ.. శునకాల్లో విశ్వాసమే కాదు.. ప్రేమ కూడా ఉంటుందంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. (చైనా: స్కూళ్లకు పిల్లలు.. వాళ్ల తలపై..)

మరిన్ని వార్తలు