కుక్కకు మరణశిక్ష

17 May, 2017 20:19 IST|Sakshi
కుక్కకు మరణశిక్ష

పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఓ పిల్లవాడిని కరిచినందుకు ఓ కుక్కకు మరణశిక్ష విధించారు. పంజాబ్ రాష్ట్రంలోని భక్కర్ కలోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ రజా సలీమ్ ఆ కుక్కకు ఈ శిక్ష విధించినట్లు జియో టీవీ పేర్కొంది. మానవీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆ కుక్కకు ఈ శిక్ష వేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ సలీమ్ తెలిపారు. పిల్లవాడిని కుక్క గాయపరిచిందని, అందువల్ల దాన్ని చంపేయాల్సిందేనని ఆయన ఆదేశించారు.

కుక్క రిజిస్ట్రేషన్‌ను తనిఖీ చేయాల్సిందిగా ఓ అధికారికి సూచించారు. ఒకవేళ అది రిజిస్టర్ అయితే, దాని యజమానిని కూడా విచారించాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రమైన శిక్ష విషయంలో అదనపు డిప్యూటీ కమిషనర్ వద్ద కుక్క యజమాని అప్పీలు దాఖలు చేసుకున్నారు. కుక్కపై బాధిత బాలుడి కుటుంబం ఫిర్యాదు చేయడంతో అది ఇప్పటికే వారం రోజుల జైలుశిక్ష అనుభవించిందని, అందువల్ల ఇప్పుడు మళ్లీ మరణశిక్ష వేయడం సరికాదని కుక్క యజమాని జమీల్ అన్నారు. తన కుక్కకు న్యాయం జరిగేందుకు తాను అన్ని కోర్టులకూ వెళ్తానని కూడా ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు