క‌రోనా: ఆస్ప‌త్రి ఎదుట‌‌ శున‌కం నిరీక్ష‌ణ‌

26 May, 2020 15:08 IST|Sakshi

వూహాన్‌: క‌రోనా పొట్ట‌న పెట్ట‌కున్న ఎంతో మందిలో ఆ శున‌కం య‌జ‌మాని ఒక‌రు. కానీ అత‌డు త‌నువు చాలించాడ‌ని తెలీని ఆ అమాయ‌క శున‌కం ఎప్ప‌టికైనా త‌న య‌జ‌మాని వ‌స్తాడ‌ని, త‌న‌తో ఎప్ప‌టిలాగా ఆట‌లాడ‌తాడ‌ని ఎదురు చూసింది. అలా ఒక‌టీ రెండు రోజులు కాదు.. మూడు నెల‌లు ఆస్ప‌త్రిలోనే ఉన్న చోట నుంచి క‌దల‌కుండా అత‌ని రాక కోసం నిరీక్షించింది. మ‌న‌సు తరుక్కుపోయే ఈ ఘ‌ట‌న చైనాలో చోటు చేసుకుంది. వూహాన్‌కు చెందిన ఓ వ్య‌క్తికి క‌రోనా సోక‌గా ఆసుప‌త్రికి వెళ్లాడు. అత‌ని వెంట‌ గ్జియావో బేవో అనే పెంపుడు శున‌కం కూడా ఉంది. అయితే ఐదు రోజుల్లోనే అత‌ను త‌నువు చాలించాడు. ఇవేమీ తెలీని ఆ కుక్క దాని య‌జ‌మాని కోసం ఆసుప‌త్రి ఆవ‌ర‌ణలోనే ఎంతో ఓపిక‌గా మూడు నెల‌ల పాటు ఎదురు చూసింది. (మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నాడు అందుకే..)

వెతుక్కుంటూ మ‌ళ్లీ ఆస్ప‌త్రికి..
దాన్ని గ‌మ‌నించిన సిబ్బంది కుక్క‌ను వేరే ప్ర‌దేశంలో వ‌దిలేసి వచ్చారు. కానీ ఆశ్చ‌ర్యంగా అది మ‌ళ్లీ ఆస్ప‌త్రిని వెతుక్కుంటూ వ‌చ్చింది. ఈ సారి దాని ఆర్తిని అర్థం చేసుకున్న సిబ్బంది దాని బాగోగులు చూసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఈ మ‌ధ్యే దానిని జంతు సంర‌క్ష‌ణ సంస్థ‌కు అప్ప‌గించారు. మ‌న‌సును క‌దిలించే ఇలాంటి ఘ‌ట‌న‌లు గ‌‌తంలోనూ ఎన్నో వెలుగు చూశాయి. న‌వంబ‌ర్‌లో 'మీ' అనే కుక్క చెరువు దాని య‌జ‌మాని చెరువులో ప‌డిపోయి మ‌ర‌ణించగా అక్క‌డే కొన్ని నెల‌ల త‌ర‌బ‌డి ఎదురు చూసింది. మ‌రో చోట ఒ రోడ్డు ప్ర‌మాదంలో య‌జ‌మాని మ‌ర‌ణించగా అత‌ని పెంపుడు కుక్క‌లు ఆ ర‌హ‌దారి ప‌క్క‌నే 80 రోజుల పాటు నిరీక్షించాయి. (ఆక‌లి కేక‌లు: కుక్క కళేబరమే ఆహారం)

మరిన్ని వార్తలు