వయసును పెంచితే.. డాలర్లు!

13 Jan, 2015 06:52 IST|Sakshi
వయసును పెంచితే.. డాలర్లు!

వాషింగ్టన్: మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పైగా పెంచగలిగే ఔషధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ప్రకటించారు. ‘మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉంది. ఇందుకోసం ఔషధం కనుగొనాలన్నది నా షరతు’ అని ఆయన పేర్కొన్నారు. ఆ పనిలో 15 శాస్త్రవేత్తల బృందాలున్నాయన్నారు.
 

మరిన్ని వార్తలు