పెంపకంతో కుక్కలకు హాని

12 Jan, 2016 14:23 IST|Sakshi

ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? అయితే మీరు కుక్క జాతికి కాస్తో కూస్తో హాని తలపెట్టినట్లే. ఎందుకంటే పెంపుడు విధానం వల్ల కుక్కల్లో హానికరమైన జన్యువుల ఉత్పత్తి అవుతున్నాయట. తద్వారా ఆ జీవాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందట! వివిధ దేశాల్లోని కుక్కజాతులపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు సోమవారం వెల్లడించారు.


తోడేలు జాతికి చెందిన కుక్కలను 15 వేల ఏళ్ల కిందటే మానవులకు మచ్చికయ్యాయి. మొదట్లో వేటాడేందుకు, ఆ తర్వాత కాపలాకు, ఇప్పుడు పాషన్ గా కుక్కల్ని పెంచుకోవటం తెలిసిందే. గడిచిన కాలం నుంచి 19 తోడేలు జాతుల్లో చోటుచేసుకున్న మార్పులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. 10 దేశాలకు చెందిన 25 అడవి కుక్కలు, 46 పెంపుడుకుక్కల (34 విభిన్న బ్రీడ్ లకు చెందినవి) పై పరిశోధనలు జరిపారు. సహజంగా పెరిగినవాటికంటే పెంపుడు కుక్కల్లో హానికరమైన జన్యుమార్పులు చోటుచేసుకోవటం గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన కిర్క్ లోముల్లర్ తెలిపారు. కొత్త బ్రీడ్ కోసం వివిధ జాతుల్ని బలవంతంగా సక్రమంలోకి దించేవిధానం కూడా కుక్కలకు చేటుచేస్తుందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు