హనోయ్‌లో ట్రంప్‌–కిమ్‌

28 Feb, 2019 02:36 IST|Sakshi
హనోయ్‌లో సమావేశమైన ఉత్తర కొరియా అధినేత కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వియత్నాంలో రెండోసారి సమావేశం

‘అణ్వస్త్ర రహిత కొరియా’దిశగా ముందడుగు

చర్చల్లో పురోగతిపై ఇరు దేశాధినేతల ఆశాభావం

హనోయ్‌: కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే దిశగా మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు రెండోసారి భేటీ అయ్యారు. వియత్నాంలోని హనోయ్‌ నగరంలో ఉన్న సోఫీటెల్‌ లెజెండ్‌ మెట్రోపోల్‌ హోటల్‌లో ఈ నేతలిద్దరూ బుధవారం మీడియా సమక్షంలో కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఈసారి సదస్సులో గొప్ప ఫలితాన్ని సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాను. దీన్ని ప్రతీఒక్కరూ తప్పకుండా స్వాగతిస్తారు’అని తెలిపారు. అనంతరం ట్రంప్‌ స్పందిస్తూ..‘గతంలో జరిగి న చర్చలతో పోల్చుకుంటే ఈ భేటీలో మెరుగైన ఫలితాలను సాధిస్తాం‘అని అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్‌లో 2018, జూన్‌ 12న ట్రంప్‌–కిమ్‌ తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉ.కొరియా పూర్తిస్థాయిలో అణ్వాయుధాలను త్యజించాలని ట్రంప్‌ కోరారు. అయితే అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపివేసేందుకు కిమ్‌ ప్రభుత్వం అంగీకరించింది.

మీడియా సిబ్బందికి నో ఎంట్రీ..
హనోయ్‌లోని మెట్రోపోల్‌ హోటల్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన తర్వాత ట్రంప్‌–కిమ్‌ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నేతలిద్దరూ డిన్నర్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ట్రంప్‌ వెంట మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు వైట్‌హౌస్‌ అధికారులు అనుమతించలేదు. ఈ విషయమై వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి సారా శాండర్స్‌ స్పందిస్తూ.. ఈ సమావేశం సున్నితత్వం నేపథ్యంలోనే మీడియా సిబ్బందికి పరిమితులు విధించామని వివరణ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా ట్రంప్‌–కిమ్‌ భేటీ కీలక ముందడుగు అవుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికా, ఉ.కొరియా ప్రతినిధి బృందాలు నేడు మరోసారి సమావేశమై అణ్వస్త్రాలను త్యజించడంపై మరోసారి చర్చలు జరుపుతున్నాయి.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌