-

తుపాకులు గర్జిస్తాయి: ట్రంప్‌

1 Jun, 2020 12:28 IST|Sakshi

వాషింగ్టన్‌: అలర్లు,ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ ముందు ఆందోళనలు మిన్నంటాయి. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ‘‘ఆందోళనకారులపై కుక్కలను ఉసిగొల్పుతాం..లూటీలు ఆపకపోతే  తుపాకులు గర్జిస్తాయి’’ అంటూ ట్రంప్‌ ట్వీట్‌తో రెండు రోజులుగా వైట్‌హౌజ్‌ ముందు ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. నిరసనకారులు వైట్‌హౌస్‌ ముందు ఉన్న పోలీసు కారును దహనం చేశారు. ఆందోళనకారులను ఆపేందుకు సీక్రెట్‌ సర్వీస్‌ పోలీసులు యత్నించారు. విద్యుత్‌ నిలిపివేయడంతో వైట్‌హౌజ్‌లో రాత్రి కొంతసేపు అంధకారం నెలకొంది.
(ట్రంప్‌ ట్వీట్‌: ఫేస్‌బుక్‌ మద్దతు)

మినియాపొలిస్‌లో రాజుకున్న అశాంతి అగ్గి అమెరికాలోని ఇతర నగరాలకూ వ్యాపిస్తోంది. జార్జి ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ను శ్వేత జాతి పోలీసు అధికారులు పొట్టనబెట్టుకోవడంపై ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగడంతో పాటు షాప్‌లు, ఆఫీస్‌లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా వాషింగ్టన్‌లో ఆదివారం శాంతియుతంగా ప్రదర్శన జరిగింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు.
(భగ్గుమంటున్న అగ్రరాజ్యం)

మరిన్ని వార్తలు