పోలీసు సంస్కరణలకు ట్రంప్‌ ఓకే

18 Jun, 2020 05:05 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంతో కొద్ది వారాల పాటు జాతి వివక్షకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం నిరసనలతో హోరెత్తిపోవడంతో ట్రంప్‌ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ సంస్కరణలను చేపట్టింది. అమెరికా పోలీసులు మరింత బాధ్యతా యుతంగా ప్రవర్తించేలా సంస్కరణలు తెస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై రోజ్‌ గార్డెన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జాతి వివక్ష అంశంపై అందులో ఎలాంటి ప్రస్తావన లేదు.

ఈ సంతకం చేసే కార్యక్రమానికి ముందు పోలీసుల దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుల కుటుంబాలను ట్రంప్‌ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల మరణాల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని కలుసుకున్న ట్రంప్‌ తన స్వరం మార్చారు. ప్రజలందరినీ సురక్షితంగా ఉంచడానికి రేయింబగళ్లు కష్టపడుతున్న పోలీసులకి గౌరవం ఇవ్వాలన్నారు. పోలీసు అధికారుల్లో అత్యధికులు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తారంటూ కొనియాడారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు