యూఎస్‌ వెళ్లాలంటే.. ఇంగ్లీష్‌ నేర్చుకోవాల్సిందే

17 May, 2019 07:55 IST|Sakshi

అమెరికా చరిత్రపై ప్రాథమిక అవగహన కూడా అవసరం

అడ్మిషన్‌కు ముందు పౌరశాస్త్ర పరీక్ష పాస్‌కావాలి

‘సివిక్స్‌’ పాస్‌ కావాలి.. నూతన వలస విధానాన్ని ఆవిష్కరించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు. అమెరికాకు వలస రావాలనుకునేవారు వారెవరైనా ఇకపై ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందేనన్నారు. అంతేకాదు అమెరికా చరిత్ర, సమాజం గురించిన ప్రాథమిక వాస్తవాలను కూడా తెలుసుకోవాలి. అమెరికా వలస విధానాన్ని తిరగరాసి కొత్త రూపు ఇచ్చేందుకు ఉద్దేశించిన సంస్కరణల ప్రతిపాదనల్లో ఈ అంశాలను పొందుపరిచినట్లు ట్రంప్‌  ప్రకటించారు. అడ్మిషన్‌కు ముందు దరఖాస్తుదారులు పౌరశాస్త్ర (సివిక్స్‌) పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా స్కిల్డ్‌ వర్కర్ల కోటా పెరిగేలా ప్రతిపాదనలు రూపొందించారు. స్కిల్డ్‌ వర్కర్ల వలసను 12 నుంచి 57 శాతానికి పెంచడం తాము చేస్తున్న పెద్ద మార్పు అని ట్రంప్‌ చెప్పారు. అయితే వీరంతా ప్రతిభ, నైపుణ్యం ఆధారంగానే రావలసి ఉంటుందని గురువారం వైట్‌హౌస్‌లో ఆయన వివరించారు.    

మరిన్ని వార్తలు