అది తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు: మేరీ ట్రంప్‌

20 Jul, 2020 14:27 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్‌-పదం(నల్లజాతీయులు) అని వాడటం చాలా సార్లు విన్నానని ఆయన సోదరుడి కూతురు మేరీ ట్రంప్‌ ఆరోపించారు. ‘టూ మచ్‌ అండ్‌ నెవర్‌ ఎనఫ్‌: హౌ మై ఫ్యామిలీ క్రియోటెడ్‌ ది వరల్డ్స్‌ మోస్ట్‌ డెంజరస్‌ మ్యాన్‌’ అనే పేరుతో తన కుటుంబ నేపథ్యంపై మేరీ పుస్తకం రచించారు. ఈ పుస్తకం గత వారం విడుదలైన సందర్భంగా మేరీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ... తన అంకుల్‌(డొనాల్డ్‌ ట్రంప్‌) జాత్యాహంకార భావాలు ఉన్న వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీవ్రమైన జాతి అహంకారం ఉన్న కుటుంబంలో పెరిగానని కూడా పేర్కొన్నారు. 

(చదవండి: మాస్కులు ధరించమని ఆదేశించలేను: ట్రంప్‌)

అంతేగాక ‘వాస్తవానికి మా అంకుల్(ట్రంప్‌)‌ చాలా సార్లు ఎన్‌ -పదం వాడటం నేను విన్నాను. ఆయన ఎంత జాతి అహంకారం ఉన్న వ్యక్తో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఆయన ఎన్‌-పదం(నల్లజాతీయులు), సెమిటిక్‌ ఆంటీ స్లర్ల్‌ పదాలను ఎప్పుడూ ఉపయోగిస్తుంటారు’ అని ఆమె వెల్లడించారు. మేరీ ట్రంప్‌ వ్యాఖ్యలను వైట్‌ హౌజ్‌ ప్రతినిధి సారా మాథ్యూస్‌ ఖండించారు. మేరీ ట్రంప్‌ రాసింది అబద్ధాల పుస్తకమని, ట్రంప్‌ ఎప్పుడు అలాంటి పదాలను వాడరని మాథ్యూస్‌ పేర్కొన్నారు. మేరీ ట్రంప్‌(55) డోనాల్డ్‌ ట్రంప్‌ సోదరుడు ఫ్రెడ్‌ జూనియర్‌ కూతురు. వారసత్వ వివాదం, కుటుంబంలో నెలకొన్న మనస్ఫర్థల కారణంగా  చాలా కాలం క్రితమే మేరీ ట్రంప్‌ తన కటుంబం నుంచి విడిపోయారు. (చదవండి: ట్రంప్‌ సర్కార్‌పై ఫేస్‌బుక్‌ సీఈఓ ఆరోపణలు)

మరిన్ని వార్తలు