భారత్‌లో అమెరికా రాయబారిగా కెనెత్‌

6 Sep, 2017 16:21 IST|Sakshi
వాషింగ్టన్‌: భారత్‌లో అమెరికా రాయబారిగా కెనెత్‌ జెస్టర్‌(62)ను నామినేట్‌ చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ప్రకటించారు. ట్రంప్‌నకు గట్టి మద్దతుదారైన జెస్టర్‌.. భారత్‌, అమెరికా చారిత్రక అణు ఒప్పందం ఖరారులో కీలక పాత్ర పోషించారు. బుష్‌ హయాంలో ఇండో-యూఎస్‌ సంబంధాల మెరుగుదలకు ఆయన తీవ్ర కృషి చేశారు. జెస్టర్‌ నామినేషన్‌ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ సెనేట్‌కు తెలిపారు.
 
సెనేట్‌ త్వరలోనే జెస్టర్‌ నియామకాన్ని ఆమోదిస్తుందని భావిస్తున్నారు. సెనేట్‌ ఆమోదం తర్వాత ప్రస్తుత రాయబారి రిచర్డ్‌ వర్మ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. హార్వర్డ్‌ లాస్కూల్‌ నుంచి కెనెత్‌ లా డిగ్రీ చేశారు. అనంతరం పబ్లిక్‌ పాలసీపై మాస్టర్స్‌ డిగ్రీ పొందారు.
 
>
మరిన్ని వార్తలు