‘మహిళా పైలట్‌.. మీకు సెల్యూట్‌..’

2 May, 2018 12:32 IST|Sakshi
టామ్‌ జో షల్ట్స్‌ను అభినందిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌ : సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మహిళా పైలట్‌ టామ్‌ జో షల్ట్స్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందించారు. గత నెల 17న సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ 1380 విమాన ఇంజిన్‌ పేలిపోవడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పైలట్‌ టామ్‌ జో షల్ట్స్‌ చాకచక్యంగా వ్యవహరించి 144 మంది ప్రాణాలను కాపాడారు. ఈ నేపథ్యంలో పైలట్‌ టామ్‌తోపాటు విమాన సిబ్బందిని అభినందించేందుకు ట్రంప్‌ వారిని వైట్‌హౌజ్‌కి ఆహ్వానించారు. ఓవల్‌ ఆఫీస్‌లో వారితో సమావేశమైన ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన, ధైర్యవంతులైన హీరోలు వైట్‌హౌజ్‌కి రావడం నాకెంతో గర్వంగా ఉందం’టూ అభినందించారు. ‘మీ ధైర్యం వల్లే ఎంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. మీకు సెల్యూట్‌ చేస్తున్నానంటూ’  ట్రంప్‌ టామ్‌ జో షల్ట్స్‌ను అభినందించారు.

ఎవరీ టామ్‌ జో షల్ట్స్‌..
అమెరికన్‌ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట‍్లలో టామ్‌ జో షల్ట్స్‌ ఒకరు. సూపర్‌సోనిక్‌ ఎఫ్‌జె-18 హార్నెట్స్‌ వంటి విమానాలు నడిపిన ఘనత ఆమె సొంతం. ఆ అనుభవంతోనే 30 వేల అడుగులో ఇంజన్‌ పేలిపోయినా ఆమె ధైర్యం కోల్పోకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసి.. వందల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ధీర వనితగా అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు