కరోనా కట్టడికి కలిసి పనిచేస్తాం

22 Jul, 2020 13:55 IST|Sakshi

డ్రాగన్‌ వ్యాక్సిన్‌పై ట్రంప్‌ రియాక్షన్‌

వాషింగ్టన్‌ : కరోనా వ్యాక్సిన్‌ను చైనాతో సహా ముందుగా ఎవరు అభివృద్ధి చేసినా వారితో పనిచేసేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. తొలి కరోనా వ్యాక్సిన్‌ను చైనా అభివృద్ధి చేస్తే డ్రాగన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమా అన్న ప్రశ్నకు ట్రంప్‌ బదులిస్తూ మనకు మంచి ఫలితాలను అందించే ఎవరితోనైనా పనిచేసేందుకు తాము సిద్ధమనేని అన్నారు. కోవిడ్‌-19కు ఔషధాల తయారీతో పాటు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అమెరికాలో పురోగతి సాధించామని ట్రంప్‌ పేర్కొన్నారు.

కరోనా నియంత్రణలో కీలకమైన వ్యాక్సిన్‌ ఆశించినదాని కంటే ముందుగానే మార్కెట్‌ లోకి వస్తుందని, అమెరికా సైన్యం వ్యాక్సిన్‌ పంపిణీలో సహకరిస్తుండటంతో సత్వరమే అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.గత ఏడాది చైనాలోని హుబే ప్రావిన్స్‌ వుహాన్‌ నగరంలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిపై వాస్తవాలను చైనా దాచిందని ట్రంప్‌ పదేపదే విమర్శిస్తూ ప్రాణాంతక వైరస్‌ను చైనీస్‌ వైరస్‌గా పలు సందర్భాల్లో అభివర్ణించారు.

చదవండి : వీసాల నిలిపివేత : ట్రంప్‌నకు భారీ షాక్‌

మరిన్ని వార్తలు