హిల్లరీ సేఫ్.. ట్రంప్ యూటర్న్

23 Nov, 2016 10:31 IST|Sakshi
హిల్లరీ సేఫ్.. ట్రంప్ యూటర్న్

న్యూయార్క్‌: తన ముందున్న సమస్యను తక్షణం అధిగమించడం కోసం మోసం చేసైనా, అబద్ధం చెప్పయినా ముందుకెళ్లాలి అనేది చాణక్య నీతి. ఇది రాజకీయ నాయకులకు బాగా పనికొస్తుందని కూడా చాణక్యుడు చెప్పాడు. ఆ నీతి ప్రభావం భారతీయ నాయకులపైనేమోగానీ.. అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై మాత్రం గట్టిగానే పడినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారానికి ముందు ముక్కుసూటి మాటలతో అమెరికా ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేసిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడొక్కక మాటను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ వార్మింగ్, హిల్లరీ క్లింటన్ ఈమెయిళ్ల వ్యవహారం, బరాక్ ఒబామాపై ఘాటు విమర్శలు చేసిన ఆయన వాటిపై తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. ఆయన మాటలు ఎలా మారాయో ఒక్కసారి పరిశీలిస్తే..
ఎన్నికల ప్రచారంలో..

గ్లోబల్ వార్మింగ్‌పై..
నాడు: గ్లోబల్ వార్మింగ్ అనేది ఓ బూటకం. అసలు అది లేనే లేదు. అమెరికాను చైనాకు పోటీగా లేకుండా చేసేందుకు చేసిన కుట్ర మాత్రమే. అది చైనా కోసం చేసిన చర్య. అది ఒక ఖరీదైన మోసం.
నేడు: 'గ్లోబల్ వార్మింగ్కు మానవ చర్యలకు గ్లోబల్ వార్మింగ్కు ఏదో సంబంధం ఉంది. ఈ విషయాన్ని నేను చాలా దగ్గరిగా పరిశీలిస్తున్నాను. ఈ విషయంలో నేను చాలా ఓపెన్ గా ఉన్నాను.
హిల్లరీ ఈమెయిల్స్ పై:..
నాడు: నేను ఎన్నికల్లో విజయం సాధిస్తే ఒక ప్రత్యేక న్యాయవాది ద్వారా హిల్లరీ ఈమెయిల్స్ అవినతి వ్యవహారాన్ని చూడాలని నా అటార్నీ జనరల్ ను ఆదేశిస్తాను.
నేడు: 'క్లింటన్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటే దేశంలో చాలా చీలికలు వస్తాయని నాకు అనిపిస్తుంది'
అధ్యక్షుడు ఒరాక్ ఒబామాపై..
నాడు: అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా బరాక్ ఒబామా దిగిపోతారు.
నేడు: నాకు అధ్యక్షుడు ఒబామా అంటే చాలా ఇష్టం. ఆయన మంచి నాయకుడు. అంటూ గతంలో తన మాటల నుంచి పక్కకు జరిగారు.

మరిన్ని వార్తలు